హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణలో గత 24 గంటల్లో 2058 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కి చేరుకుంది. 

కాగా, తెలంగాణలో కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 984కు చేరుకుంది. తెలంగాణలో లక్షా 29 వేల 187 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇంకా 30,400 కరోనా పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

హైదరాబాదులోనూ రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. హైదరాబాదులో కేవలం 277 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 143 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అయినప్పటికీ తెలంగాణలో ఎప్పటిలాగే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలవారీగా తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 20
భద్రాద్రి కొత్తగూడెం 75
జిహెచ్ఎంసీ 277
జగిత్యాల 52
జనగామ 30
జయశంకర్ భూపాలపల్లి 28
జోగులాంబ గద్వాల 29
కామారెడ్డి 43
కరీంనగర్ 135
ఖమ్మం 103
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 24
మహబూబ్ నగర్ 38
మహబూబాబాద్ 68
మంచిర్యాల 41
మెదక్ 38
మేడ్చెల్ మల్కాజిగిరి 97
ములుగు 36
నాగర్ కర్నూల్ 42
నల్లగొండ 96
నారాయణపేట 13
నిర్మల్ 42
నిజామాబాద్ 84
పెద్దపల్లి 48
రాజన్న సిరిసిల్ల 45
రంగారెడ్డి 143
సంగారెడ్డి 24
సిద్ధిపేట 106
సూర్యాపేట 62
వికారాబాద్ 24
వనపర్తి 23
వరంగల్ రూరల్ 11
వరంగల్ అర్బన్ 108
యాదాద్రి భువనగిరి 53