హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో 1802 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1 లక్షా 42 వేల 771కి చేరుకుంది. క

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి 9 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 895కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కు చికిత్స పొంది 2711 మంది కోలుకున్నారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయినవారి సంఖ్య లక్షా 10 వేల 241కి చేరుకుంది. ఇంకా 31635 యాక్టివ్ కేసులున్నాయి. 

హైదరాబాదులో గత 24 గంటల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోదంి. గత 24 గంటల్లో హైదరాబాదులో కేవలం 245 పాజిటివ్ కేసులు మాత్రమే రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 158, కరీంనగర్ జిల్లాలో 136, సిద్ధిపేట జిల్లాలో 106, సంగారెడ్డి జిల్లాలో 103 కేసులు నోదయ్యాయి.