కరోనా ఎఫెక్ట్: ఆస్తమా రోగులకు షాక్.. ఈ ఏడాది చేపమందు పంపిణీ రద్దు

కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు.

coronavirus effect no fish prasadam for this year says bathini harinatha goud

కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఏటా మృగశిర కార్తి రోజున వేసే చేప ప్రసాదం ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదని బత్తిని హరినాథ్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కరోనా ఎప్పటికి పూర్తిగా అంతం అవుతుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు వందల సంవత్సరాలుగా ఆస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత వ్యాధులకు ప్రతి ఏటా ఇస్తోన్న చేప ప్రసాదం ఈ ఏడాది ఇవ్వడం లేదన్నారు.

Also Read:కాలినడకన భార్యాపిల్లలతో సొంతూరికి: వూళ్లోకి రానివ్వని గ్రామస్తులు, 10 రోజులుగా గుడిలోనే

మానవాళిని గృహ నిర్బంధం చేయిస్తూ అందినవార్ని అంతమొందిస్తున్న మహమ్మారి కరోనాకి ఏమందూ లేదని హరినాథ్ అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో పాటు, ప్రతి క్షణం పరి శుభ్రత పాటించడమూ, అత్యవసర మైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటమే రక్షణ అని ఆయన పేర్కొన్నారు.

ఏటా దేశ విదేశాలనుంచి వేలాది మంది మా చేప మందుకోసం హైదరాబాద్ వస్తుంటారని... కరోనా కారణంగా ఈ సంవత్సరం మాత్రం ఎవ్వరు రావొద్దని హరినాథ్ విజ్ఞప్తి చేశారు.

Also Read:తెలంగాణలో మళ్లీ కలకలం: వరుసగా రెండో రోజూ 30కి పైగా కేసులు, 1,196కి చేరిన సంఖ్య

ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈ నెల 29 తో ముగిసినా తరువాత పరిస్థితులను బట్టి జూన్ లో పొడిగించినా తాము మాత్రం ఈ సారి చేప ప్రసాదం పంపిణీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ పేరుతో ఎవరైనా చేప మందు ఇస్తామని ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని తక్షణం తమకు గానీ పోలీసు వారికి గాని తెలియచేయాలని బత్తిని కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios