తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... ఒక్కరోజే వెయ్యి పైచిలుకు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత పెరిగింది. ఈ వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించనప్పటి నుండి ఎప్పుడూ లేనంతలా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

corona updates in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ మరింత పెరిగింది. ఈ వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించనప్పటి నుండి ఎప్పుడూ లేనంతలా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 1087కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు సింగిల్ డే లో ఇన్నికేసులు నమోదవడం ఇదే మొదటిసారి. 

శనివారం మొత్తం  3923 శాంపిల్స్ పరీక్షించగా 1,087 పాజిటివ్, 2,836 నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ పాజిటివ్ కేసులతో కలుపుకుని మొత్తం ఇప్పటివకు తెలంగాణలో కేసుల సంఖ్య 13,436కు చేరింది. ఇందులో ఇప్పటికే 4,928 మంది ఈ వైరస్ బారినుండి బయటపడి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 162 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా రాష్ట్రంలో 8,265 యాక్టివ్ కేసులున్నాయి. ఈ రోజు కరోనా కారణంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 243కు చేరింది.

read more  ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: మరో ఉన్నతాధికారికి పాజిటివ్

జిల్లాల వారిగా ఇవాళ్టి కేసులను చూసుకుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనే 888 కేసులు బయటపడ్డాయి. ఇక శివారు జిల్లాలయిన రంగారెడ్డి 74, మేడ్చల్ 37, సంగారెడ్డి 11 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 35 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 

కామారెడ్డి 5, కరీంనగర్ 5, సిరిసిల్ల 3, సిద్దిపేట 2, వరంగల్ అర్బన్ 7, మహబూబ్ నగర్ 5, ఆసిఫాబాద్ 1, ఖమ్మం 1, నాగర్ కర్నూల్ 4, వనపర్తి 1, భద్రాద్రి కొత్తగూడెం 2, మహబూబాబాద్ 1, జనగాం 4, మంచిర్యాల 1 కేసు నమోదయ్యాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios