Asianet News TeluguAsianet News Telugu

భువనగిరి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం: 5 గంటలైనా కరోనా రోగికి అందని చికిత్స

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది.  కరోనా లక్షణాలు ఉన్న రోగి చికిత్స కోసం ఆసుపత్రి వద్దకు వచ్చినా కూడ పట్టించుకోలేదు

corona patient waiting for treatment in Bhuvanagiri hospital
Author
Hyderabad, First Published Jul 27, 2020, 9:24 PM IST


భువనగిరి: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది.  కరోనా లక్షణాలు ఉన్న రోగి చికిత్స కోసం ఆసుపత్రి వద్దకు వచ్చినా కూడ పట్టించుకోలేదు. ఐదు గంటలుగా ఆసుపత్రి వద్దే పడిగాపులు కాసినా కూడ చికిత్స చేయలేదు. మీడియా రావడంతో రోగిని అంబులెన్స్ లో హైద్రాబాద్ కు తరలించారు.

భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో  కరోనా లక్షణాలతో ఓ రోగి సోమవారం నాడు చికిత్స కోసం వచ్చాడు. 5 గంటలుగా ఆసుపత్రిలో ఉన్నా కూడ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. చికిత్స చేయాలని కోరినా కూడ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.

also read:తల్లి కళ్లముందే కొడుకు మృతి: సుమోటోగా తీసుకొన్న ఎన్‌హెచ్ఆర్‌సీ

అయితే ఈ విషయాన్ని రోగి బంధువులు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రికి మీడియా సిబ్బంది వచ్చారు. మీడియాను చూసిన ఆసుపత్రి సిబ్బంది  కరోనా లక్షణాలు ఉన్న రోగిని అంబులెన్స్ లో హైద్రాబాద్ కు తరలించారు. 

నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో తల్లి కళ్ల ముందే మాడ్గులపల్లి మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు  మరణించాడు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన మరణించాడు. మరణించిన తర్వాత పరీక్షిస్తే ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios