గాంధీలో డాక్టర్ పై దాడి చేసిన కరోనా రోగి అరెస్ట్

గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో కరోనా రోగిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. 
 
corona patient arrested for attacking on doctors in Hyderabad
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో కరోనా రోగిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. 

ఈ నెల 1వ తేదీన కరోనా రోగి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే అతను మరణించాడని ఆరోపిస్తూ మృతుడి సోదరుడితో పాటు బంధువులు డాక్టర్లపై దాడికి దిగారు.
also read:హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో రత్నదీప్ సూపర్ మార్కెట్ సీజ్

డాక్టర్ పై దాడికి పాల్పడిన వారిలో కరోనా రోగి కూడ ఉన్నాడు. అదే ఆసుపత్రిలో కరోనా రోగి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితులను పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కరోనా రోగి కూడ ఉన్నాడు. వీడియో కాన్పరెన్స్ ద్వారా జడ్జి ముందు నిందితులను పోలీసులు హాజరుపర్చారు. అయితే నిందితులను రిమాండ్ కు తరలిస్తూ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.
also read:హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలో రత్నదీప్ సూపర్ మార్కెట్ సీజ్

కరోనా రోగిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. నిందితులు కుత్బుల్లాపూర్ కు చెందినవారు. 

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో కూడ డాక్టర్ పై ఓ రోగి దాడికి పాల్పడ్డాడు. దాడి చేసిన రోజు సాయంత్రం దాడి చేసిన వ్యక్తికి కరోనా సోకినట్టుగా రిపోర్టులు తేల్చి చెప్పాయి. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.కరోనా రోగిని అరెస్ట్ చేయడం దేశంలోనే మొదటిసారిగా చెబుతున్నారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios