కరోనా ఎఫెక్ట్: ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లపై రోగుల దాడి
హైదరాబాద్:హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లపై మంగళవారం నాడు దాడి చేశారు. కరోనా రోగులను అనుమానితులను ఒకేచోట చేర్చడంతో ఈ దాడి జరిగింది.
ఉస్మానియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఇద్దరు కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇదే ఐసోలేషన్ వార్డులో కరోనా రోగులను చేర్చారు. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రోగులతో పాటు అనుమానిత రోగులను ఒకేచోట చేర్చడంతో తమకు కూడ ఈ వైరస్ సోకే అవకాశం ఉందనే అనుమానంతో పీజీ డాక్టర్లపై ఇవాళ దాడి చేశారు.
ఈ విషయమై పీజీ డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండ్ దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాదు దాడి విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గత నెలలో గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడితో పాటు అతని కుటుంబసభ్యులు డాక్టర్లపై దాడికి దిగారు.
Also read:గాంధీ వైద్యులపై దాడిపై సీరియస్: కరోనా రోగితో పాటు మరో ముగ్గురిపై కేసు
మృతుడి సోదరుడు కూడ ఇదే ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకొంటున్నాడు.ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. డాక్టర్లపై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసింది.
తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో కూడ రోగులు దాడికి దిగడంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొంటుందో చూడాలి.