హైదరాబాద్:హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ ను గురువారం నాడు జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందున సూపర్ మార్కెట్ ను సీజ్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు.

కరోనా లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొనేందుకు కొన్ని దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రత్నదీప్ సూపర్ మార్కెట్ లో పనిచేసే సిబ్బంది గ్లౌజ్ లు, మాస్కులు ఉపయోగించడం లేదని ప్రజల నుండి జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

also read:లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనలు: ఎల్బీనగర్ డీ మార్ట్ సీజ్

సోషల్ డిస్టెన్స్ కూడ పాటించడం లేదని కూడ ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు రత్నగిరి సూపర్ మార్కెట్ బ్రాంచీలపై గురువారం నాడు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో పనిచేసే సిబ్బంది కనీసం గ్లౌజ్ లు, మాస్కులు కూడ వాడడం లేదని అధికారులు గుర్తించారు. మరో వైపు బిల్లింగ్ కౌంటర్ వద్ద కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని గుర్తించారు.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని శ్రీనగర్ బ్రాంచీని సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ డీ మార్ట్ ను కూడ  జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.