రోజురోజుకు స్వెరో చీఫ్ ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా హిందూ దేవుళ్లపై స్వేరో సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించి మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు. హిందూ దేవుళ్లను పూజించం అంటూ చేయించిన ప్రతిజ్ఞ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

"

ప్రభుత్వ అత్యున్నత పోస్టులో, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. అంతేకాదు ఇది జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారు.

హిందూ దేవుళ్లన్నా, హిందూ సమాజం అన్నా ద్వేషాన్ని నూరిపోస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా బేధాలు సృష్టించడం వల్ల సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఐపిఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై విరుచుకుపడుతున్నారు.