జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడించేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. జీహెచ్‌ఎంపీ పాలకమండలి సర్వసభ్య సమావేశం వేళ బల్దియా కాంట్రాక్టర్లు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడించేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. జీహెచ్‌ఎంపీ పాలకమండలి సర్వసభ్య సమావేశం వేళ బల్దియా కాంట్రాక్టర్లు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారు లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లక పలువురు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కొత్త నిబంధనలతో జీహెచ్‌ఎంసీ తమను ఇబ్బందులకు గురిచేస్తుందని బల్దియా కాంట్రాక్టర్లు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న 800 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 

కార్పొరేటర్లు అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

ఇక, ఈ ఏడాది మార్చి నుంచి దాదాపు రూ. 800 కోట్ల బిల్లులు చెల్లించనందుకు నిరసనగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కాంట్రాక్టర్ల సంఘం అన్ని ఇంజినీరింగ్ మరియు మెయింటెనెన్స్ పనులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం గురువారం నుంచి అమల్లోకి వస్తుందని అసోసియేషన్ తెలిపింది.