AIMIM: ఎంబీటీ, ఎంఐఎం పార్టీలతో కాంగ్రెస్ దోబూచాట.. మజ్లిస్‌తో పొత్తుకు వెయిటింగ్!

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయితే, ఎంఐఎంతో కుదరకుంటే ఎంబీటీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంబీటీతో 2012 నుంచి పొత్తు చర్చలు సా.. గుతున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేవు. ఎంఐఎంతో పొత్తు కోసమే ఎంబీటీతో దోస్తీని కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిందని చెబుతున్నారు.
 

congress waiting for alliance with aimim and put mbt in waiting list in telangana kms

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. ఒక్క సీపీఐ ఎమ్మెల్యే మద్దతు కాంగ్రెస్‌కు ఉన్నది. అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని చాలా మంది నేతలు బహిరంగంగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎంతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నాలు చేసింది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, చాంద్రయాణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా అయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఎంఐఎంతో సత్సంబంధాల కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. కానీ, ఎంఐఎం అందుకు అంగీకరించలేదు. ఈ ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని అర్థం అవుతున్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంబీటీతో దోస్తీకి బీజం పడటం లేదు.

ఎంఐఎంతో దోస్తీ, పేచీపై కాంగ్రెస్‌లోనే రెండు వైఖరులు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎంఐఎంతో దోస్తీ అక్కర్లేదని ఎంబీటీతో స్నేహం చేసి అసదుద్దీన్‌ను హైదరాబాద్ ఎంపీ స్థానంలోనే ఓడించాలని అనుకుంటున్నది. ఇందుకోసం ఎంబీటీతో చర్చలు మొదలు పెట్టింది. ఈ కూటమి అభ్యర్థిగా ఎంబీటీ చీఫ్ అంజదుల్లా ఖాన్ నిలబడాలనీ ప్రతిపాదించింది. 2012 నుంచి ఎంబీటీతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నది. కానీ, ఇది వరకు డీల్ ఫైనల్ కాలేదు. దీంతో ఈ కూటమి సెట్ అవుతుందా? అటకెక్కుతుందా? అనేది సస్పెన్స్‌గానే ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్‌తో ఎంఐఎం వైఖరి ఆధారంగా ఈ కూటమి లెక్క తేలనుంది.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ. 59 శాతం ఓటు షేర్‌తో అసదుద్దీన్ ఘనంగా గెలిచారు.

Also Read: కాశీ, మథుర ఇచ్చేస్తే వేరే మసీదులను అడగం: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కోశాధికారి

గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న ఎంఐఎం చార్మినార్‌ వద్దగల భాగ్యలక్ష్మీ ఆలయానికి సంబంధించిన వివాదంతో 2012లో విడిపోయాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఎంఐఎంతో కేసీఆర్ పార్టీతో చెట్టాపట్టాలేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీతో మజ్లిస్ పార్టీ సన్నిహితంగా ఉంటుందని భావించి ఆ పార్టీతో పొత్తు కోసం హస్తం పార్టీ ప్రయత్నిస్తున్నది.

కాంగ్రెస్ ఆడే ఈ దోబూచాటకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందా? అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఓ టీపీసీసీ నేత స్పందించారు. సాధారణంగా ఎన్నికలు సమీపించినప్పుడు కూటముల విషయాలు వేగం అందుకుంటాయి. ఇదే సమయంలో ఎంబీటీ, కాంగ్రెస్ పొత్తుపై స్పష్టత వస్తుందని అన్నారు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే కాంగ్రెస్ అధికారికంగా తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉన్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios