రెండు తెలుగు రాష్ట్రాలను కేసీఆర్ కలుపుతానంటే తాను మద్దతిస్తానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ వివరణ ఇవ్వాలని జగ్గారెడ్డిని కోరారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ manickam tagore షాకిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతానంటే మద్దతిస్తానని చేసిన Jagga Reddy చేసిన వ్యాఖ్యలపై Congress పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఈ విషయమై స్పందించారు.ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని జగ్గారెడ్డిని కోరారు ఠాగూర్. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మాణికం ఠాగూర్ ఆరా తీశారు. ఏ పరిస్థితుల్లో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే విషయమై ఆయన పార్టీ నేతలను అడిగి తెలుసుకొన్నారు.

also read:టీపీసీసీలో వివాదానికి తెర.. అలా మాట్లాడటం తప్పే: రేవంత్‌పై వ్యాఖ్యలకు జగ్గారెడ్డి క్షమాపణలు

రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలని ఎవరూ కూడా మాట్లాడొద్దని కూడా ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియాగాంధీ అని ఆయన గుర్తు చేశారు. పార్టీకి నష్టం కల్గించేలా ఎవరూ కూడా మాట్లాడొద్దని కూడా ఠాగూర్ ఆదేశించారు.

రెండు రాష్ట్రాలను కేసీఆర్ కలుపుతానంటే తాను మద్దతిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు.వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకోవద్దని పార్టీలో ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. ఇక రేవంత్ రెడ్డికి తన అభిప్రాయాన్ని అడ్డుకునే హక్కు లేదని, తాను ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర అంటే తప్పుబట్టారని ఇప్పుడు సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలని అని అన్నారు

తన స్టాండ్ మొదటి నుండే సమైఖ్య రాష్ట్రమేనని ఆయన గుర్తు చేశారు. సమైఖ్య రాష్ట్రం పేరున ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కొత్త డ్రామాలకు తెరతీశాయని ఆయన ఆరోపించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ , తెలంగాణ సీఎంలు రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరునాడే జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది.

టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీశాయి. ఏపీలో కూడా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని వినతులు వస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానిలు స్పందించారు. ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు.... ఎక్కడైనా పోటీ చేయవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందించారు.

తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోతుందని నాని చెప్పారు.ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. జగన్, కేసీఆర్ లు కుట్రకు తెరలేపారని వ్యాఖ్యానించారు. తెలంగాణను ఏపీలో విలీనం చేసే కుట్ర సాగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. రెండు రాష్ట్రాలను కలిపితే తాను మద్దతిస్తానని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పార్టీకి ఈ వ్యాఖ్యలు నష్టం చేసేలా ఉన్నాయనే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు వ్యక్తం చేశారు.