Asianet News TeluguAsianet News Telugu

టీపీసీసీలో వివాదానికి తెర.. అలా మాట్లాడటం తప్పే: రేవంత్‌పై వ్యాఖ్యలకు జగ్గారెడ్డి క్షమాపణలు

టీపీసీసీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యల దుమారానికి తెరపడింది. పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడొద్దని హైకమాండ్ చెప్పిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పానని జగ్గారెడ్డి చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని జగ్గారెడ్డి తెలిపారు. 

mla jagga reddy expresses apology for remarks on tpcc chief revantdh reddy
Author
Hyderabad, First Published Sep 25, 2021, 3:23 PM IST

టీపీసీసీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యల దుమారానికి తెరపడింది. తాము అన్నదమ్ముల్లాంటి వారమని , కలిసి మాట్లాడుకుంటాం, కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడొద్దని హైకమాండ్ చెప్పిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పానని జగ్గారెడ్డి చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని జగ్గారెడ్డి తెలిపారు. అటు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. నిన్నటి వివాదానికి కమ్యూనికేషన్ గ్యాపే కారణమని చెప్పారు. 

కాగా, నిన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Tpcc chief Revanth Reddy) పై జగ్గారెడ్డి (Jagga Reddy) సీరియస్ అయ్యారు. పార్టీ సీనియర్ నేతల మధ్య జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి తీరుపై ఆవేశంతో ఊగిపోయారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను సీఎల్పీ సమావేశానికి ముందు పార్టీ సీనియర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు.

ALso Read:రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు: ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

ఇది కాంగ్రెస్ పార్టీయా? లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో చర్చించకుండానే రెండు మాసాల కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జహీరాబాద్ లో క్రికెట్ మ్యాచ్ విషయంలో గీతారెడ్డికి సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. సంగారెడ్డికి వస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నాకే సమాచారం ఇవ్వరా? అని ఆయన అడిగారు. కనీసం ప్రోటోకాల్ పాటించాలి కదా అని అడిగారు.

సమాచారం ఇవ్వకుండా నాతో విబేధాలు ఉన్నట్టు రేవంత్  చెప్పాలని అనుకొంటున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ లో ఏ ఒక్కరో హీరో కాలేరని ఆయన చెప్పారు.గత శనివారం నాడు జూమ్ మీటింగ్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రెండు మాసాల కార్యాచరణపై చర్చించారు.ఈ సమావేశానికి కొందరు సీనియర్లు హాజరు కాలేదు. అయితే సీనియర్లకు చెప్పకుండానే ఈ కార్యాచరణను ఎలా ప్రకటిస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios