పెద్దపల్లి: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి మరోసారి రెచ్చిపోయారు. కేసీఆర్ జాతకాల పిచ్చే ముందస్తు ఎన్నికలకు కారణమంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆమె కేసీఆర్ ను పదేపదే దొర దొర అంటూ సంబోంధించారు. 

ముందస్తు ఎన్నికలకు కారణం దొర కేసీఆరేనని అన్నారు. కేసీఆర్‌ జాతకాల పిచ్చితో ముందస్తుకు వచ్చారని ఆరోపించారు. డిసెంబర్‌ 7 తర్వాత కేసీఆర్ రాక్షస పాలనకు ప్రజలు పుల్ స్టాప్ పెడతారని డిసెంబర్ 11న రాక్షస పాలన అంతమవుతుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ దొరా...: కంట తడి పెట్టిన విజయశాంతి

తెలంగాణకు కాదు, అవినీతి సొమ్ముకు కాపలా కుక్క కేసీఆర్: విజయశాంతి