కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రజా కూటమి తరఫున ప్రచారం చేస్తూ కాంగ్రెసు స్టార్ కాంపైనర్ విజయశాంతి కంట తడి పెట్టారు.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విజయశాంతి ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా ఉద్యమ సంఘటనలను గుర్తు చేసుకుని విజయశాంతి కంటతడి పెట్టారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకోవాలని విజయశాంతి ప్రజలను కోరారు. 

"కేసీఆర్ దొరా...తెలంగాణ ప్రజలను ఇక మోసం చేయలేవ"ని విజయశాంతి అన్నారు. ఏనుగు రవీందర్‌రెడ్డి భూదందాలతో ప్రజలు విసిగిపోయారని ఆమె అన్నారు.