మధిర: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపైనర్ విజయశాంతి నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను గాంధీతో పోల్చడం సిగ్గు చేటు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్కకు మద్దతుగా పర్యటిస్తున్న ఆమె నల్లా, జాబు ఇవ్వని కేసీఆర్ కు ఎందుకు ఓటెయ్యాలి అని ప్రశ్నించారు. 

మరోవైపు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును విజయశాంతి వెనకేసుకు వచ్చారు. చంద్రబాబును కేసీఆర్ తిట్టాల్సిన అసరం కేసీఆర్ కు ఏముందని నిలదీశారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాయని విజయశాంతి ఆరోపించారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

డబ్బులిస్తే తీసుకోండి: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు