కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావుకు కరోనా సోకింది. ఆయన ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అస్వస్థతకు గురైన వి. హనుమంతరావు శనివారం నాడు  ఆపోలో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 
కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు కరోనా సోకినట్టుగా తేలింది. అదే ఆసుపత్రిలో ఆయన కరోనాకు చికిత్స తీసుకొంటున్నారు.

also read:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకూ కరోనా

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణరెడ్డి కూడ ఇటీవలనే కరోనా బారినపడ్డారు. మరో వైపు ఇప్పటికే రాష్ట్రంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ కరోనా బారినపడ్డారు. తొలుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కరోనాతో చికిత్స పొందుతున్నారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కూడ కరోనా సోకింది. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భార్య, వంట మనిషి, డ్రైవర్ కు కూడ కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 546 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదయ్యాయి. కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నా రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి.