Asianet News TeluguAsianet News Telugu

కేటిఆర్ మీద జానారెడ్డి అలిగిండా ?

  • కేటిఆర్ గురించి ఇదే లాస్ట్ ప్రెస్ మీట్
  • ఇకనుంచి నేను కేటిఆర్ మీద అసలే మాట్లాడ
Congress senior leader Janareddy says he wont speak on KTR now onwards

తెలంగాణలో సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ గా నిలిచిన జానారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడారు. అంతటి సంచలన నిర్ణయం ఏమిటబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి జానారెడ్డి మాట్లల్లోనే..

కేటిఆర్ లాంటి వ్యక్తుల పై కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడమంటే...నాస్తాయి తగ్గించుకున్నట్లే అవుతుంది. ఇది ప్రజలు, నాభిమానులు గమనించాలి. కేటిఆర్ మీద కౌంటర్ ప్రెస్ మీట్ ఇదే చివరిది. ఇక మీదట నేను కేటిఆర్ మీద మాట్లాడను. పిరాయింపులను నేను గతంలోనే వ్యతిరేకించాను నేను పార్టీ మారినప్పుడు నా పదవికి రిజయిన్ చేశా. నేను ఒక పార్టీ పెట్టి...దాన్ని కాంగ్రెస్ లో మెర్జ్ చేశా. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో కూడా లేదు. ఏంఆశించి చేయలేదు.

తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు కాబట్టే ఒక పార్టీలో ఉండాలి కాబట్టి...రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఒకసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక తెలంగాణలో టిఆర్ఎస్ అడ్రస్ ఉండదు. టిఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంస్కరణలకు ఆద్యుడు జానారెడ్డి. లక్ష 70 వేల ఎకరాల ఆయకట్టు ఇరిగేషన్ ప్రాజెక్టులతో నీళ్లందించేలా చేశాను.

మేం చేసింది చెప్పాము. మరి టిఆర్ఎస్ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది...ఏం చేసిందో చెప్పుకోవాలి. కేటిఆర్ అర్హతకు మించి అలీబాబా అని మాట్లాడారు. అధికారగర్వంతో హేళనగా...కుసంస్కారంగా...అర్థంపర్థం లేని సందర్భాల్లో మాట్లాడడం సరికాదు. స్థాయిని మించిన వాళ్లపై మాట్లాడితే..స్థాయి పెరుగుతుందనుకుంటున్నారు. ఒక ముఠా ను తయారుచేసుకుని ఊత పదాలతో ప్రజలను భ్రమింపజేస్తున్నారు. కేటిఆర్ మాటలను ఖండిస్తున్నాను. కేటిఆర్ నా స్థాయి కాదని అనుకున్నా...అయినా మాట్లాడాల్సి వస్తుంది. ఎవ్వరి మీద ఏవైనా కేసులుంటే...వారు బాద్యులవుతారు. వారికీ శిక్షలు వేయండి. టిఆర్ఎస్ లో అందరి మీద కేసులున్నాయి.

66గ్రామాలకు నిన్న కేటిఆర్ ప్రారంభం చేసినదానికి... నేనే శంకుస్థాపన చేశాను. 100 కోట్లు నిధులు కేటాయించాను. ఇప్పుడు కేటిఆర్ ప్రారంభించి ..కాంగ్రెస్ ఏం చేసిందనడం కరెక్టేనా.? పాలేరుకట్ట మీద వేసిన శిలాఫలకంలో నాపేరుంటది కావాలంటే చూస్కో. ఈమధ్య సూర్యాపేట లో ఒకరు ప్రారంభించారు...అది కూడా నేను శంకుస్థాపన చేసిందే. సిరిసిల్ల, సిద్ధిపేట, ఎల్లారెడ్డి, ముధోల్ లలో కూడా నిధులను నేను మంజూరుచేశా. కృష్ణా నీళ్ళు తెచ్చి హైదరాబాద్ కు నీటి కటకట లేకుండా చేసింది కాంగ్రెస్.

పునాదులేసి... ఎవరో ఇల్లు కట్టిన తర్వాత...దాని పై పెంట్ హౌస్ వేసి...చూసినవా నేను కట్టిన ఇల్లు ఎట్లున్నది అన్నట్లుంది. తప్పుచేసిన వాళ్లకు...మోసం చేసిన వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలు జరిగాయంటున్నారు...అలాంటి వారిని గుర్తించండి..శిక్షించండి అని చెప్పాము.

టిఆర్ఎస్ ఇచ్చిన గొర్రెల్లో సగం గొర్రెలయిన ఉన్నాయా...? గొర్రెల అవకతవకలకు టిఆర్ఎస్ వాళ్ళు ఏమైనా చేశారా...అని అడగాల్సి ఉంటుంది...? కులం పేరు చెప్పి ఓట్లు దండుకునే అవకాశముంది. తెలంగాణ ఆత్మాభిమానం పై దెబ్బ కొట్టే టిఆర్ఎస్ పార్టీని ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పక తప్పదు.

Follow Us:
Download App:
  • android
  • ios