Asianet News TeluguAsianet News Telugu

Revanth Reddy: ఆ రెండు పార్టీలు రాజ‌కీయంగా కుమ్మక్కయ్యాయి - రేవంత్ రెడ్డి.

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షులురేవంత్ రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ, టీఆర్ఎస్, బీజేపీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు.  
 

congress revanth reddy fire on bjp, trs,
Author
Hyderabad, First Published Dec 9, 2021, 5:30 PM IST

Revanth Reddy: తెలంగాణ‌ పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. పీసీసీ అధ్యక్షులుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ లో ప‌ర్య‌టించారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కోసం కోడంగ‌ల్ నియోజ‌క వ‌ర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. 

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీ,టీఆర్ఎస్ ల‌పై విమ‌ర్శాస్త్రాలు సంధించారు.ఈ రెండు పార్టీలు వ‌రిపై రాజ‌కీయాలు చేస్తోన్నాయ‌నీ,  రైతులు తాము పండించిన పంటలను అమ్ముకునే దిక్కు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/telangana-cm-kcr-visits-secretariat-r3uhj5

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుపై ఆయ‌న మండిపడ్డారు. ఈ రెండు పార్టీ తీరుపై  విసుగు చెంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పార్ల‌మెంట్ లో రైతుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల్సిన తెరాస.. నిరసనల పేరుతో పార్ల‌మెంట్ ను వాక్ అవుట్ చేశాయ‌ని మండి పడ్డారు. టీఆర్ఎస్, ఇత‌ర ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 

కానీ టీఆర్ ఎస్ ఎంపీలు మాత్రం రైతుల సమస్యలను ప్రస్తావించకుండా.. బీజేపీతో కుమ్మ‌క్కై.. పార్ల‌మెంట్ బ‌య‌ట నిర‌స‌న తెలిపారు. తూతూ మంత్రంగా నిరసన కార్యక్రమాలు చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఒక‌వేళ కేంద్రం వ‌రిని కొనుగోలు చేయ‌క‌పోతే..  ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నాడు… ఇక్కడ కేసీఆర్ అదే చెపుతున్నాడని ఫైర్ అయ్యారు.

Read Also: https://telugu.asianetnews.com/andhra-pradesh/tdp-leader-nara-lokesh-satires-on-mangalagiri-mla-alla-ramakrishna-reddy-r3uj3s

సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ కేంద్ర‌మంత్రి అపాటిమెంట్ తీసుకోలేదని, కానీ ఈ మంత్రిని, ఆ మంత్రిని క‌లిశాన‌ని ఆస‌త్య ప్ర‌చారం చేస్తోన్నారని మండిపడ్డారు.   కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల త‌మ వైఖ‌రిని మార్చుకోని.. వెంట‌నే ధాన్యం కొనుగోలు చేయాల‌ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. కరోనా సమయంలో తెలంగాణ‌లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

 అలాగే.. సింగరేణి సమ్మెకు మద్దతు పలికారు రేవంత్ రెడ్డి. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా త‌న గ‌ళం విప్పాడు. దేశానికి, రాష్ట్రానికి వెలుగులు పంచే సింగరేణిని ప్రైవేటుపరం చేయ‌డం స‌మ‌జ‌సం కాద‌నీ, ఆ సంస్థ‌ను  కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సింగరేణిలో 4 కోల్ బ్లాక్స్ ప్రైవేటీకరణ చేయాల‌న్న  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణను నిలుపుదల చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. అని స్పష్టం చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios