రైతులకు పెట్టుబడి రూపంలో చెల్లించబోతున్న చెక్కుల మీద ముఖ్యమంత్రి కేసిఆర్ ఫొటో ప్రచురించాలనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు కాంగ్రెస్ నాయకురాలు రవళి కూచన. ముందుగా పాస్ పుస్తకాల మీద కేసిఆర్ బొమ్మలు ముద్రిస్తామని చెప్పి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారని విమర్శించారు. ఇప్పుడు రైతులకు ఇచ్చే పెట్టుబడి చెక్కుల మీద కేసిఆర్ బొమ్మలు వేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. కేసిఆర్ ఆ డబ్బును ఏమైనా ఆయన ఇంట్లోంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవళి ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూడండి.