భారీ వర్షాల ఎఫెక్ట్: పాలమూరు ప్రజా గర్జన సభ ఆగస్టు 5వ తేదీకి వాయిదా

భారీ వర్షాల కారణంగా  పాలమూరు ప్రజా గర్జన సభను  ఆ పార్టీ వాయిదా వేసింది.  ఈ ఏడాది ఆగస్టు  5వ తేదీకి ఈ సభను  వాయిదా వేశారు కాంగ్రెస్ నేతలు. 

Congress post pones  Palamuru Prajagarjana Sabha  To  August 08  lns

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ  ఈ నెల  30న నిర్వహించతలపెట్టిన  పాలమూరు ప్రజా గర్జన సభను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా  ఈ సభను ఆగస్టు ఐదో తేదికి వాయిదా వేస్తున్నట్టుగా ఆ పార్టీ నేతలు  ప్రకటించారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా  ఇప్పటికే  ఒకసారి కొల్లాపూర్ సభను ఆ పార్టీ నేతలు వాయిదా వేశారు. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో  మరోసారి ఈ సభను వాయిదా వేస్తున్నట్టుగా  కాంగ్రెస్ పార్టీ నేతలు  గురువారంనాడు ప్రకటించారు.

ఈ నెల  30న నిర్వహించతలపెట్టిన  ప్రియాంక గాంధీ సభ గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు  ఇవాళ  చర్చించారు.  ప్రస్తుతం రాష్ట్రంలో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  సభకు  జన సమీకరణ  ఇబ్బందయ్యే అవకాశం ఉందని  నేతలు అభిప్రాయపడ్డారు.  అంతేకాదు  సభ కూడ సజావుగా జరిగే అవకాశం ఉండదని భావించారు.   దీంతో  ఈ సభను వాయిదా వేయాలని  నిర్ణయం తీసుకున్నారు.   వాస్తవానికి ఈ నెల  20వ తేదీన  ఈ సభను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు.

 వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ సభను  వాయిదా వేశారు.  ఈ నెల  30వ తేదీన ఈ సభను నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  అయితే  భారీ వర్షాల నేపథ్యంలో  ఈ సభను  వాయిదా వేయాలని  ఇవాళ  కాంగ్రెస్ పార్టీ నేతలు  నిర్ణయించారు.  వచ్చే నెల  5వ తేదీన  ఈ  సభను నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.  ఇదే  సభలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొల్లాపూర్ సభలో  ప్రియాంక గాంధీ  పాల్గొంటారు.  ప్రియాంక గాంధీ సమక్షంలోనే  వీరంతా కాంగ్రెస్ పార్టీలో  చేరడానికి రంగం సిద్దం  చేసుకున్నారు.

also read:కారణమిదీ: పాలమూరు ప్రజా గర్జన సభ వాయిదా

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  బీఆర్ఎస్ నాయకత్వం  మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరారు.   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు  ప్రియాంకగాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios