కారణమిదీ: పాలమూరు ప్రజా గర్జన సభ వాయిదా
ఈ నెల 20వ తేదీన నిర్వహించాల్సిన పాలమూరు ప్రజా భేరి సభ వాయిదా పడింది. ప్రియాంక గాంధీ టూర్ ఖరారు కాకపోవడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సభ వాయిదా పడింది.
హైదరాబాద్: ఈ నెల 20వ తేదీన నిర్వహించాల్సిన పాలమూరు ప్రజా భేరి సభ వాయిదా పడింది .ఈ సభలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో ఈ సభ వాయిదా పడింది.
ఈ నెల 20న కొల్లాపూర్ లో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి,ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. దీంతో ఈ ఇద్దరు నేతలతో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలు చర్చలు జరిపింది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు నిర్ణయించారు.
ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరారు. ఈ నెల 20వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జూపల్లి కృష్ణారావు రంగం సిద్దం చేసుకున్నారు.ఈ నెల 20వ తేదీన కొల్లాపూర్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభను నిర్వహించాలని భావించారు.అయితే ప్రియాంక గాంధీ టూర్ ఖరారు కాని కారణంగా ఈ సభను వాయిదా వేశారు.