హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టుగా ప్రకటించారు.

ఇప్పటికే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియానాయక్, సుధీర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు. కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించారు.పార్టీ మారుతామని  ప్రకటించిన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.