తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బోథ్, వనపర్తి, చేవెళ్ల అభ్యర్ధులకు బీ ఫాంను ఇవ్వకుండా ఆపింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సరిగా లేదంటూ స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బోథ్, వనపర్తి, చేవెళ్ల అభ్యర్ధులకు బీ ఫాంను ఇవ్వకుండా ఆపింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక సరిగా లేదంటూ స్థానిక నేతల నుంచి ఫిర్యాదులు అందడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మూడు స్థానాల అభ్యర్ధులపై సమీక్ష నిర్వహించనుంది. బోథ్ నుంచి వెన్నెల కిశోర్‌, వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, చేవేళ్ల నుంచి పామెన భీం భారత్‌‌లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred