Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఓ వెలమ కంపెనీ:కుంతియా, ఉత్తమ్ సేఫ్

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కుంతియా

Congress party leader Kuntia sensational comments on KCR


హైదరాబాద్: టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు, ఓ వెలమ కంపెనీ అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ముఖ్య  నేతలు, డీసీసీ అధ్యక్షులతో సోమవారం నాడు  కుంతియా గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశం తర్వాత గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్నికలకు కేసీఆర్ సిద్దమైతే ఇతర పార్టీల నుండి నేతలను ఎందుకు  తీసుకొంటున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కూడ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్దంగానే ఉంటుందని  ఆయన స్పష్టత ఇచ్చారు.

నాలుగేళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందని  కుంతియా ప్రశ్నించారు.  తమ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే కేసీఆర్ ప్రయత్నించారని  కుంతియా విమర్శించారు.

రైతుబంధు పథకం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భూస్వామ్యులకు మాత్రమే రైతు బంధు పథకం ఉపయోగపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.  

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఆయన చెప్పారు. ఎఐసిసి కార్యదర్శులకు రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు  ఇంచార్జీ బాధ్యతలను అప్పగించినట్టు కుంతియా ప్రకటించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios