మున్సిపల్ ఫలితాలు ఎలా ఉన్నా ....తెలంగాణ పిసీసీ చీఫ్ పదవి మంచి తప్పుకుంటున్నానని  ముందుగానే ప్రకటన చేయడంతో పిసిసి  నూతన అధ్యక్షుడు ఎవరన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Also read: పీసీసీ చీఫ్ హోదాలో ఉత్తమ్‌కు ఇవే చివరి ఎన్నికలు

 రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా సమర్థవంతంగా పార్టీని నడిపించి, పార్టీని భవిష్యత్తులో పూర్వవైభవం సాధించే అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయ పడుతున్నారు.

also read:మున్సిపల్ పోల్స్‌లో కానరాని లెఫ్ట్ అభ్యర్థులు

 దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో  కొద్ది మంది  కీలక నేతల్లో పిసిసి చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో అన్నది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అసెంబ్లీ, పార్లమెంట్ లో ఓ మోస్తారు ఫలితాలను సాధించిన కాంగ్రెస్  అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా వెనుక పడింది.

 తెలంగాణలోని 32  జిల్లా పరిషత్ స్థానాల్లో ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేకపోయింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఊహించిన కంటే తక్కువగానే  స్థానాలు వచ్చాయి.

 దక్షిణ తెలంగాణ జిల్లాలు మినహాయిస్తే ఇతర తెలంగాణ జిల్లాల్లో ఆ పార్టీకి పెద్దగా స్థానాలు కూడా దక్కలేదు. నగర శివారు తో పాటు నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొద్దిపాటి స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ తన ఉనికిని చాటుకుంది.

Also read:మున్సిపల్ ఎన్నికల వేడిలో అమెరికాకు కవిత, కారణమిదేనా....?

Also read:మున్సిపల్ ఎన్నికలు 2020: గులాబీ గూటిలో కొట్లాటలకు బ్రేక్ ఇలా...

 ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే టీపీసీసీ చీఫ్ పార్టీని ముందుకు నడిపించడం ఓ పెద్ద సవాల్ గానే మారనుంది. పార్టీలో ఎప్పుడు వుండే సమస్యలు, పార్టీ క్యాడర్ ను పెంచుకోవడం....వంటి కార్యక్రమాలు చేయడం పెద్ద పరీక్షే.

పిసిసి చీఫ్ రెస్ లో పది మంది పేర్లు చర్చలో ఉన్నా ఎవరికి పదవి వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.వచ్చే నెల చివరి నాటికి తెలంగాణ నూతన పిసిసి చీఫ్ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

 పిసిసి చీఫ్ రేసులో ఎంపీలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి లతో పాటు మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, విహెచ్ ల తో పాటు మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు  ప్రముఖంగా వినిపిస్తోంది.

వీధిలో ఎవరికైనా పిసిసి చీఫ్ పదవి దక్కే అవకాశం ఉందని పార్టీలో నేతలు అంటున్నారు.

అయితే గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి దక్కితే సహించేది లేదని సీనియర్లు ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. 

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. రాబోయే నాలుగేళ్లలో పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పార్టీని ముందుకు నడిపించే నేతను ఎంపిక చేస్తే బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.