మేళ్లచెరువు జాతరను స్థానిక నేతలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాతరకు బతుకుదెరువుకు వచ్చేవాళ్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

మేళ్లచెరువు, జాన్ పాడు మీదుగా రైల్వేలైన్‌కు కేంద్రం సానుకూలంగా వుందన్నారు టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేళ్లచెరువు జాతరను స్థానిక నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతరకు బతుకుదెరువుకు వచ్చేవాళ్ల దగ్గర వసూళ్లకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. లిఫ్టులతో బీడు భూములను అద్భుతంగా తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేశారు. 

Also REad: తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుంది: కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలనం

ఇకపోతే.. నూతన సంవత్సరం సందర్భంగా కోదాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు సొంతిల్లు కూడా లేదని.. తమకు పిల్లలు కూడా లేరని, కోదాడ, హుజూర్‌నగర్ ప్రజలే తమ పిల్లలుగా భావిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలోనే అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన గుర్తుచేశారు. పదవిలో వున్నా లేకునా ప్రజల కోసమే పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.