Asianet News TeluguAsianet News Telugu

ఏదో ఒక రోజు సీఎం అవుతా .. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర లేదన్నారు. 
 

congress mp komatireddy venkat reddy sensational comments on cm post ksp
Author
First Published Nov 7, 2023, 2:45 PM IST | Last Updated Nov 7, 2023, 2:45 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ స్థానానికి ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో జరిగిన రోడ్ షోలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ నుంచి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుందని, ఏదో ఒక రోజు సీఎం అవుతానని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర లేదన్నారు. 

మాయమాటల చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని.. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదని.. ఆత్మహత్యల కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోలేదన్నారు. ఉద్యోగాల భర్తీలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని.. పోలింగ్ చివరి రోజు రైతుబంధు డబ్బులు వేస్తారని మోసపోవద్దని కోమటిరెడ్డి సూచించారు. 

నల్గొండలో కనిపిస్తున్న అభివృద్ధి తాను చేసినదేనని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు 70 ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని.. కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో ఓ బ్యారేజ్ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9 మనకు లక్కీ నెంబర్ అని.. ఆ రోజు సోనియా పుట్టినరోజని, ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios