మీ నాన్న దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదు.. ఉద్యమంలో నువ్వెక్కడ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి ద్రోహుల్ నీ చుట్టూ వున్నారని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టే నాటికి కేటీఆర్ అమెరికాలో వున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం కేటీఆర్ మాతో పొత్తు పెట్టుకున్నాడని.. వైఎస్ వద్దు అన్నా ఎదిరించి మాట్లాడామని కోమటిరెడ్డి గుర్తుచేశారు.
కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని.. పిల్లలు చనిపోతున్నారని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారని ఆయన తెలిపారు. తెలంగాణ పేరుతో కేటీఆర్.. లక్షల కోట్లు సంపాదించాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 20 ఏళ్ల క్రితం 400 పెన్షన్ అంటే దాని విలువ ఎంతో తెలుసుకోవాలని కేటీఆర్‌కు చురకలంటించారు. అప్పట్లోనే 32 లక్షల ఇళ్లు కట్టించామని కోమటిరెడ్డి గుర్తుచేశారు.
ALso Read: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ విజయ భేరి సభ.. 5 హామీలు ప్రకటించనున్న హస్తం అధిష్టానం
కేటీఆర్ వెంట వున్నదంతా తెలంగాణ ద్రోహులేనని దుయ్యబట్టారు. దానం నాగేందర్ ఉద్యమకారులను కొట్టాడని వెంకట్ రెడ్డి చెప్పారు. తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి ద్రోహుల్ నీ చుట్టూ వున్నారని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి .. పాలు, పూలతో పాటు భూములు కూడా అమ్ముకున్నాడని ఆయన ఆరోపించారు. పువ్వాడ అజయ్‌కి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం వుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీతో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావని ఆయన నిలదీశారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు గానీ.. మాపై మాట్లాడతున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.