కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి హాట్ కామెంట్స్

కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జలదోపిడి చేసి నల్లగొండకు డిండి లిఫ్ట్ ద్వారా నీళ్లివ్వాలన్న ప్రయత్నాన్ని తాను అడ్డుకుంటానని ప్రకటించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తాను మొదటి నుంచీ వ్యతిరేకినే అని హెచ్చరించారు.

డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన గీకారం ఎర్రవెల్లి రిజర్వాయర్ భూసేకరణ కోసం కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన గ్రామ సభను ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ గ్రామ సభ వద్ద జనాలతో మాట్లాడారు. ఆ వీడియో కింద చూడండి. గ్రామ బహిష్కరణ ను రైతులు అడ్డుకున్న వీడియో కూడా అందులోనే ఉన్నది.