పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బుధవారం నాడు Komatireddy Rajagopal Reddy చౌటుప్పల్ లో మీడియాతో మాట్లాడారు. గౌరవం ఇవ్వని చోట తాను పార్టీలో ఉండనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కూనడా చెప్పారు. తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన చెప్పారు.
KCR ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతానని ఆయన తేల్చి చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు.. Congress పార్టీ గట్టిగా TRS కు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలో పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన చెప్పుకొచ్చారు.
స్వార్ధం కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. ప్రజల కోసం త్యాగం చేస్తామన్నారు. తాను పార్టీ మారాలనుకొంటే ప్రజలతో చెప్పి మరీ పార్టీ మారుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు పార్టీ పదవుల కు కూడా resign చేస్తానన్నారు. మరో వైపు తాను తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను బీజేపీలో చేరుతున్నామని చెప్పామా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా పార్టీ లో కొనసాగుతున్న తమను పార్టీకి దూరం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కాంట్రాక్టర్ అని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో సీఎల్పీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సరైన మద్దతు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయంో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది.
గతంలో కూడా పార్టీ మార్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తిరుపతిలోనే తాను పార్టీ మారుతానని కూడా ప్రకటించారు. గత ఏడాది జనవరి 1వ తేదీన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.బీజేపీలో చేరుతానని కూడా ఆయన చెప్పారు. అంతకుముందు తాను బీజేపీలో చేరుతానని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో రాజగోపాల్ రెడ్డి చసిన ఆడియో సంభాషణ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కానీ ఆ తర్వాత పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవలనే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. తమ మధ్య ఉన్న స్నేహం నేపథ్యంలో ఇద్దరం కలుసుకున్నామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా టీఆర్ఎస్ పై దూకుడుగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
