తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని, అక్కడికి వెళితే చనిపోతామని ప్రజలు భయపడిపోతున్నారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read:అంత్యక్రియలైన 5 రోజులకు కరోనా నిర్ధారణ: ఫ్యామిలీ, గ్రామస్థుల్లో భయం

మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సంగారెడ్డిలో ఇటీవల టోపీ బాబా అనే వ్యక్తి చనిపోయారని ఆయన ఉటంకించారు. కోవిడ్ కాలంలో ప్రజలకు ఇతర జబ్బులు చేసినా ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్లు చేర్పించుకోవడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరొచ్చినా జాయిన్ చేసుకుని చికిత్స అందించేలా ఆదేశాలివ్వాలని జగ్గారెడ్డి కోరారు.

Also Read:ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించాల్సిందే.. కరోనాపై రంగంలో అమ్మవారు.

తానే ఒకవేళ మంత్రిగా ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో మంచం వేసుకుని ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇప్పుడు రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలు తనకు ముఖ్యమని పేర్కొన్నారు. తన వ్యూహాలు తనకు ఉన్నాయి... భవిష్యత్‌లో తన ఆట తాను ఆడుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.