Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ‌.. 12 గంట‌ల్లో స్పందించ‌కుంటే...

Jagga Reddy : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల వ్య‌వ‌హారం మ‌రింత‌గా ముదురుతోంది. ఇప్ప‌టికే ఇంట‌ర్ ఫ‌లితాల విష‌యంలో విద్యార్థి సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. 12 గంట‌ల్లో స్పందించ‌క‌పోతే.. దీక్ష‌ల‌కు దిగుతానంటూ హెచ్చ‌రించారు. 
 

Congress MLA Jagga Reddy writes letter to CM KCR
Author
Hyderabad, First Published Dec 22, 2021, 5:19 PM IST

Jagga Reddy : గ‌త వారం తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. అయితే, రికార్డు స్థాయిలో ఈ సారి విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో త‌ప్ప‌డంతో ఈ అంశం వివాదాస్ప‌దమ‌వుతోంది. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు, తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విద్యార్థి సంఘాలు, ప‌లు పౌర సంఘాల‌తో పాటు ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ పార్టీలు కూడా ఆందోళ‌నకు దిగాయి. సగంమందికి పైగా విద్యార్థులు ఫెయిలవడం విస్మయానికి గురిచేసింది. అయితే, దీనికి బోర్డు నిర్లక్ష్యమే కారణమంటూ… విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపట్టడంతో రగడ మొదలైంది. ఇప్పుడు ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్యలకు  చేసుకోవ‌డంతో మ‌రింత‌గా దుమారం రేపుతోంది. రాజ‌కీయ పార్టీలు సైతం ఈ అంశాన్ని లేవ‌నెత్తి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు దాడి కొన‌సాగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బ‌హిరంగ లేఖ రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఉతీర్ణతపై నెలకొన్న గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టాలని ఆయ‌న  డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఈ విష‌యంపై 12 గంట‌ల్లో స్పందించ‌క‌పోతే... తాను దీక్ష‌కు దిగుతానంటూ జ‌గ్గారెడ్డి హెచ్చ‌రించారు. 

Also Read: Round-up 2021 | చ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని ఏడాది.. అనేక విషాదాల‌కు నిలువుట‌ద్దం 2021 !

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ‌లో ప్ర‌స్తావించిన వివ‌రాలు ఇలావున్నాయి.. ఇంట‌ర్ ఫ‌లితాలు అంద‌రిని విస్మ‌యానికి గురిచేశాయ‌నీ,  విద్యార్థులు, తల్లి తండ్రులు చాలా ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా విద్యార్థుల చ‌దువుల‌పై ప్ర‌భావం ప‌డింద‌ని అన్నారు.  క‌రోనా కార‌ణంగా కాలేజీలు మూత ప‌డ‌టంతో విద్యార్థులు ఆన్ లైన్ చదువుల‌కు మారారు. అయితే, స‌రైన వ‌స‌తులు, సౌక‌ర్యాలు లేక  సరిగ్గా చదవలేక పోయారని పేర్కొన్నారు.  ఇంత‌కు ముందు క‌రోనా స‌మ‌యంలో ప్ర‌మోట్  చేసి..  మ‌ళ్లీ ప‌రీక్ష‌లు పెట్టి వారిని  పెయిల్ చేయడం సరికాదన్నారు.  ప్ర‌భుత్వ, ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యం కార‌ణంగా విద్యార్థుల జీవితంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌న్నారు. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌నే మ‌న‌స్థాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పదుతున్నారని పేర్కొన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు విద్యార్థులు బ‌ల‌మ‌న్మ‌ర‌ణాలు పాల్ప‌డ్డారు. ప్ర‌స్తుతం విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమైన విష‌య‌మ‌ని జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

Also Read: Rahul Gandhi : బూస్టర్ డోసులు ఎప్పుడంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

ప్ర‌భుత్వం విద్యార్థుల విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు.   విద్యార్థుల శ్రేయస్తు కోరి..  కనీసం మార్కుల‌తో పాస్ చేయాల‌న్నారు. మంత్రులు.. కనీసం ఆలోచన చేయకుండా ఇంటర్‌ ఫలితాలు ప్రకటించడం సరైంది కాదని  జగ్గారెడ్డి అన్నారు.  అనాలోచిత నిర్ణయాలు.. ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని లేఖలో పేర్కొన్నారు  ప్రభుత్వం 12 గంటల్లో సానుకూలం నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే గురువారం ఇంటర్ బోర్డు ముందు దీక్షకు దిగుతానంటూ ఆయ‌న హెచ్చ‌రించారు. అలాగే, మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డిని విమ‌ర్శించారు.  సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విద్యా మంత్రి సబిత విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క‌పోతే.. గురువారం  ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇదిలావుండ‌గా, ఇప్ప‌టికే ప‌లువురు విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌ని మ‌న‌స్థాపానిక గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గురువారం కూడా ఒక విద్యార్థి బ‌ల‌వంతంగా ప్ర‌ణాలు తీసుకున్నాడు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయ్యామ‌నే కార‌ణంగా ఇప్ప‌టికే ముగ్గురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాల‌నీకి చెందిన బుర్రివార్ నందిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంపీసీ ఇంట‌ర్ సెకెండియ‌ర్ చ‌దువుతోంది. ప‌రీక్ష‌ల్లో త‌ప్పాన‌ని ప్రాణాలు తీసుకుంది. 

Also Read: నాలుగేండ్ల‌లో 3117 మంది మైనారిటీలకు భారత పౌరసత్వం: కేంద్రం

Follow Us:
Download App:
  • android
  • ios