Asianet News TeluguAsianet News Telugu

Round-up 2021 | చ‌రిత్ర‌లో మ‌ర్చిపోలేని ఏడాది.. అనేక విషాదాల‌కు నిలువుట‌ద్దం 2021 !

Round-up 2021: ఈ ఏడాదిలో చరిత్రలో చ‌విచూడ‌ని ఎన్నో ఘ‌ట‌న‌లు జ‌రిగాయి. చ‌రిత్ర మ‌ర్చిపోలేని ఏడాదిగా.. అనేక విషాదాల‌కు నిలువుట‌ద్దంలా సాక్షంగా నిలిచింది 2021 ఏడాది. కంటికి కనిపించని కరోనా భూతం భారత్‌లో విలయతాండవం చేసింది. క‌రోనా సెకండ్ వేవ్‌లో  లక్షలాది మంది బ‌లితీసుకుంది.   ఆక్సిజన్, మందులు లభించక వేలాది మంది కండ్ల‌ముందే ప్రాణాలు విడిచిన విషాద ఘ‌ట‌న‌లు ఈ ఏడాలోనే చోటుచేసుకున్నాయి. రైతు ఉద్య‌మం నేప‌థ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.  గణతంత్ర దినోత్సవం రోజున హింస చెల‌రేగ‌డం,  లఖీంపూర్ ఖేరీ ఘటన, రాజ‌కీయాలు ర‌చ్చ‌, దేశ మొట్ట‌మొద‌టి  సీడీఎస్ బిపిన్ రావత్ మరణం ఇలా చాలా ఘటనలు  ఈ ఏడాదిలోనే చోటుచేసుకున్నాయి. 
 

Year Ender2021- Round-up 2021
Author
Hyderabad, First Published Dec 22, 2021, 4:28 PM IST

Round-up 2021:

దేశ‌రాజ‌ధానిలో జ‌న‌వ‌రి 26 హింస‌.. రైతుల మరణం

2021 ఏడాది ప్రారంభంలోనే  దేశ రాజ‌ధాని ఢిల్లీలో హింహ చెల‌రేగింది. కేంద్రం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు కొత్త‌ వ్యవసాయ చ‌ట్టాల‌ను నిరసిస్తూ ఢిల్లీలో వేలాది మంది రైతులు జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారు. ఈ ఘటన హింసాత్మకంగా మార‌డంతో పాటు ప‌లువురు రైతులు చ‌నిపోగా.. పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. ముఖ్యంగా చారిత్రాత్మక ఎర్రకోటపై నిరసనకారులు జాతీయ జెండా దించి..  ఓ మతానికి ప్రతీక అయిన జెండాను ఎగురవేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

మార్చిలో బెంగాల్ ఎన్నిక‌ల ప్రారంభంతో హింస‌.. 

ఈ ఏడాది మార్చిలో బెంగాల్ ఎన్నిక‌లు ప్రారంభ‌మై ప‌లు విడ‌త‌లుగా కొన‌సాగి ముగిశాయి. శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో  హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. వ‌రుస పెట్టి జ‌రిగిన హత్యలు,  లైంగిక దాడులు, ఘ‌ర్ష‌ణ‌ల కార‌ణంగా ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ, టీఎంసీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగిన ఈ హింస‌లో ఆస్తితో పాటు ప్రాణ‌న‌ష్టం కూడా అధికంగా చోటుచేసుకుంది. 

కరోనా సెకండ్ వేవ్.. కోవిడ్‌కు ల‌క్ష‌ల మంది బ‌లి

ఈ ఏడాదిలో చోటుచేసుకున్న అతిభ‌యాన‌క విష‌యాల్లో క‌రోనా సెకండ్‌వేవ్ మొద‌టి స్థానంలో ఉంద‌ని చెప్పాలి. కోవిడ్ సెకండ్ వేవ్, ఆక్సిజన్ సంక్షోభం, బ్లాక్ ఫంగస్ లు ఈ ఏడాదిలో భార‌తీయ ఆరోగ్య రంగంలోని లోపాల‌ను ఎత్తిచూపాయి.  క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ కార‌ణంగా దేశంలో కోట్లాది మంది ఆస్ప‌త్రి పాల‌య్యారు. ల‌క్ష‌ల మందిని క‌రోనా బ‌లితీసుకుంది. ఒకానొక స‌మ‌యంలో ఆస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోయి.. వైద్యం కోసం ఆస్ప‌త్రుల్లో అడ్మిన్ చేసుకోవ‌డానికి సౌక‌ర్యాలు లేని విధంగా మారింది. ఆస్ప‌త్రుల గేట్ల ముంద‌రే వేలాది మంది ప్రాణాలు వ‌దిలారు. మందులు కొర‌త ఏర్ప‌డింది. ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా ఆస్ప‌త్రుల్లోనూ వంద‌ల మంది మ‌ర‌ణించారు. దీనికి తోడు బ్లాక్ ఫంగ‌స్ విరుచుకుప‌డింది. దీంతో నిత్యం వెలాది మ‌ర‌ణాల‌తో దేశంలో మ‌ర‌ణ మృదంగం మోగింది. మృత‌దేహాల‌తో శ్మ‌శాన వాటిక‌లు నిండిపోయాయి. రోజుల కొద్ది వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. గంగాన‌దిలో, అక్క‌డి ఇసుకు దిబ్బ‌ల్లో శ‌వాలు బ‌య‌ట‌ప‌డటం ఇలా చెప్పుకుంటూ పోతే.. హృద‌య విదార‌క దృశ్యాలు అనేక ఈ ఏడాదిలో క‌నిపించాయి.

అక్ర‌మార్కుల వివ‌రాలు బ‌హిర్గ‌తం చేసిన పాండోరా పేప‌ర్స్.. 

ఏడాదిలో అనేక మంది అక్ర‌మార్కుల వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ దుమారం ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది.  పాండోరా  పేపర్ లీక్‌  ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ICIJ) అక్టోబర్ 3న 200 దేశాలు, ఆయా భూభాగాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పేర్లతో కూడిన 11.9 మిలియన్ ఫైళ్లను లీక్ చేసింది. అక్ర‌మంగా సంపాదించి.. నల్లడబ్బును విదేశాల్లో దాచిపెట్టిన వారి వివరాలను ఐసీఐజే  బ‌య‌ట పెట్టింది. ఇందులో ప్ర‌పంచంలోని  ప్రముఖ వ్యాపారవేత్తలు, క్రీడా ప్రముఖులు, సినీ తారలు సహా 300 మందికి పైగా భారతీయుల పేర్లు ఉన్నాయి. ఇప్ప‌టికీ ఇది హాట్ టాపిక్ గా ఉంది. 

రైతుల ప్రాణాలు బ‌లిగొన్న కేంద్ర మంత్రి కాన్వాయ్.. 

రైతులు అంశాలు 2021 ఏడాదిలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీశాయి. ఇప్ప‌టికీ రైతుల‌కు సంబంధించిన విష‌యాలు హాట్ టాపిక్ గా ఉన్న‌ది లఖీంపూర్ ఖేరీ ఘటన.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లఖింపుర్‌ ఖేరీలో ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా శాంతియుత నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి కేంద్ర మంద్రి  అజయ్‌ మిశ్రా కాన్వాయ్ దూసుకుపోవ‌డంతో రైతులు ప్రాణాలు కోల్పోయారు. కావాల‌నే  రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో పొనిచ్చాడ‌ని ఇటీవ‌లే ఈ ఘ‌ట‌న‌పై ఏర్ప‌డిన క‌మిటీ పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో.. దేశవ్యాప్తంగా రైతులు, పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలంటూ విపక్షాలు డిమాండ్ ను ఇప్ప‌టికీ చేస్తున్నాయి. 

దేశ మొట్ట‌మొద‌టి సీడీఎస్ మృతి 

ఈ ఏడాది చోటుచేసుక‌న్న విషాద‌క‌ర ఘ‌ట‌న‌ల్లో కూనూరు ప్ర‌మాదం ఒక‌టి. దేశ మొట్ట‌మొద‌టి  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జ‌న‌ర‌త్  బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. డిసెంబరు 8న తమిళనాడులో  చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య సహా  13 మంది మరణించారు. ఈ దుర్ఘటన దేశంలో అత్యంత విషాదాన్ని మిగిల్చింది. బిపిన్ రావత్‌ను 2019లో మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios