హైదరాబాద్: సంగారెడ్డి  జిల్లా కలెక్టర్, కొందరు అధికారులు టీఆర్‌ఎస్ కు   తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ అధికారులపై చర్యలు తప్పవని జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తమ పార్టీకి చెందిన  సర్పంచ్ లను పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. 

సంగారెడ్డి కలెక్టర్  హనుమంతరావు  ఏం గొప్ప పనిచేసాడని సీఎం కేసీఆర్ పొగిడారో అర్థం కావడం లేదన్నారు. సీఎం దృష్టిలో మిగితా 32మంది కలెక్టర్లు బెస్ట్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ ప్రజా ప్రతినిదులపై వేధిస్తే ఊరుకొనేది లేదన్నారు. అధికారులు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించకూడదని ఆయన కోరారు.

టీఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ  కాంగ్రెస్  ఎమ్మెల్యే  సీరియస్ కామెంట్స్ చేస్తుంటాడు. ఇవాళ నేరుగా అధికారులపై ఆయన విమర్శలు గుప్పించారు.