హైదరాబాద్: కేసీఆర్‌ వల్ల తనకు రెండు సార్లు మంచి జరిగిందని  సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పారు.  హరీష్‌రావుతోనే తనకు విబేధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమయంలో తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు ఆయన చెప్పారు.

ఇటీవల తనను జైల్లో పెట్టడంతో మా కుటుంబం నుండి రాజకీయ వారసురాలిని తెరమీదికి తెచ్చినట్టు ఆయన చెప్పారు.కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి వైరం లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హరీష్‌రావుతోనే తనకు విబేధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

తనను జైల్లో పెట్టించింది కూడ హరీష్ రావేనని  జగ్గారెడ్డి ఆరోపించారు.  హరీష్‌రావువి బ్లాక్ మెయిల్ రాజకీయాలని జగ్గారెడ్డి విమర్శలు చేశారు.లాబీయింగ్ చేసే వాళ్లకే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో  ఉన్నత స్థాయికి ఎదగాలనే కసి తనకు లేదన్నారు. తనలాంటి వాళ్లకు లాబీయింగ్ చేసే వాళ్లు లేరన్నారు.