తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో శనివారం గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తుండగా... కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఒక రోజుపాటు వీరిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.

Also Read తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: సీఏఏ పై తేల్చేసిన కేసీఆర్...

గవర్నర్ ప్రసంగంపై దన్యవాద తీర్మానంలో కేసీఆర్ సమాధానం ఇస్తుండగా పలుమార్లు కాంగ్రెస్ సభ్యులు ఆటకం కలిగించారు. దీంతో సస్పెండ్ చేశారు. అయితే... సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా వారు సభను వీడకపోవడం గమనార్హం. శ్రీధర్ బాబు, భట్టి, జగ్గారెడ్డి, వీరయ్య,  రాజ్ గోపాల్ రెడ్డి లు సస్పెండ్ అయినవారిలో ఉన్నారు. కాగా... సభ నుంచి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారి తీరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

గొంతు చించుకోవద్దని తాము వందమందిమి ఉన్నామంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వైఖరి సరిగాలేదన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పతనావస్థను అందరూ చూశారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్ని జరిగినా దేశ, రాష్ట్రస్థాయి ల్లో కాంగ్రెస్ కి బుద్ధి రావడం లేదన్నారు.  రాజకీయాల్లో సహనం అవసరమన్నారు. వాళ్ల ఓపిక రోజు రోజుకీ దిగజారిపోతోందన్నారు.