హైదరాబాద్: పరిమితులను నిర్దేశించుకొని టీడీపీతో వ్యవహరించాలని తాను  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించినట్టు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, మాజీ ఎంపీ  విజయశాంతి  చెప్పారు.

ఆదివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను పురస్కరించుకొని తెలంగాణలో తాము టీడీపీతో పొత్తు పెట్టుకొన్నామని ఆమె చెప్పారు.  టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కలిసి వచ్చే శక్తులను కలుపుకొనిపోతున్నామని... అందులో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకొన్నట్టు ఆమె వివరించారు.

టీడీపీతో పొత్తుల విషయంలో  తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో  పరిమితులతోనే వ్యవహరించాలని  ఆమె అభిప్రాయపడ్డారు.  శనివారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు భేటీ అయ్యారు.  సీట్ల సర్దుబాటుపై చర్చించిన విషయం తెలిసిందే

సంబంధిత వార్తలు

అన్న కేసీఆర్ వేరు, సీఎం కేసీఆర్ వేరే: విజయశాంతి

కత్తి దూసిన జానా: రాములమ్మ, జేజమ్మల విన్యాసాలు

ఎందుకో చెప్పాల్సిందే: కేసీఆర్‌కు విజయశాంతి సవాల్

చిరంజీవి, పవన్ లపై విజయశాంతి సంచలన కామెంట్స్

పవన్ డిఫరెంట్, ఇప్పుడే ఏం చెప్పలేం: విజయశాంతి

చిరుతో సై, శశికళను అందుకే కలిశా: విజయశాంతి

అందుకే పిల్లలు వద్దనుకొన్నాం: విజయశాంతి