రైతాంగ సమస్యలపై ఇంట్లోనే దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత వీహెచ్
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఒక్క రోజు దీక్షకు దిగారు. గురువారం నాడు తన ఇంట్లోనే హనుమంతరావు దీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఒక్క రోజు దీక్షకు దిగారు. గురువారం నాడు తన ఇంట్లోనే హనుమంతరావు దీక్ష నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలులో విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ధాన్యాన్ని కోనుగోలు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు గుర్తు చేశారు.
also read:తెలంగాణ సీఎస్ సోమేష్‌కుమార్‌తో విపక్షాలు భేటీ: కరోనా, రైతుల సమస్యలపై చర్చ...
అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొందన్నారు. ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇవాళ ఉదయం నుండి హనుమంతరావు తన ఇంట్లోనే దీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్ష నేతలు కూడ రైతాంగ సమస్యలతో పాటు కరోనా విషయమై సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించారు.