కేసిఆర్ రైతు బంధు పథకంపై కాంగ్రెస్ శ్రవణ్ ఫైర్

First Published 9, May 2018, 7:17 PM IST
Congress leader Sravan refutes Rythu bandhu scheme
Highlights

ఈ ప్రశ్నలకు బదులు చెప్పాలి

తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టనున్న రైతు బంధు పథకంపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవన్ దాసోజు మండిపడ్డారు. ఆయన మీడియా సమావేశంలో పలు కీలకమైన ఆరోపణలు చేశారు. ఆయనేమన్నారో చదవండి.

తెలంగాణ గడ్డ మీద పుట్టిన రైతుకు ఇసుక రేణువంత మేలు జరిగినా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ గత నాలుగు సంవత్సరాలుగా రైతు రాబందుగా మారి ఇప్పుడు రైతు బంధు అని చెప్పడం ఒక డ్రామా. ఎకరాకు నాలుగు వేలు కాదు ఎకరాకు 40వేలు ఇచ్చినా రైతుల ఉసురు తగలక  మానదు. వ్యవసాయం దండగ అంటే పండగ అని నిరూపించింది గత కాంగ్రెస్ ప్రభుత్వం. బీటీ విత్తనాల సంచి 1850 ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 650 కి తగ్గించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.

తెలంగాణలో ఒక కోటి 24 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంది,45 లక్షల రైతులు మాత్రమే సాగు చేసే రైతులు. కానీ ఇప్పుడు ఒక కోటి 39లక్షల ఎకరాలు, రైతులు 56 లక్షలు అనీ వారందరికీ చెక్కులు ఇస్తామంటున్నరు. కొత్తగా 13 లక్షల రైతులు ఎక్కడినుండి పుట్టుకొచ్చారో కేసిఆరే చెప్పాలి. దాదాపు 600 కోట్ల పైన నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయో చెప్పాలి. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొడు భూములు సాగు చేసే గిరిజన రైతు బిడ్డలకు నాలుగు వేలు ఇవ్వవు. కౌలు రైతులకు ఇవ్వవు.

తమిళనాడులో, ఆంధ్ర, కర్ణాటకలో రైతులకు అనేక పథకాలు ఉన్నాయి. మిర్చి రైతులను పక్క రాష్ట్రం ఆంద్రప్రదేశ్ ఆదుకుంటే,కేసీఆర్ పట్టించుకోలేదు. 35 లక్షల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉంటే ఇంతవరకు స్పందించలేదు. 4500 లకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు పరిహారం లేదు,పరమర్శించలేదు. రైతు అప్పు కట్టలేదని భూములు వేలం వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం,రైతు బంధువా,రైతు రాబందువా జనాలు తేల్చుకోవాలి. రైతు రుణ మాఫీ ఇంతవరకు జరగలేదు.

లక్షల సంఖ్యలో ఉన్నటువంటి దళితులకు 3ఎకరాల భూమి అని చెప్పి కేవలం 4వేల మంది రైతులకు మాత్రమే ఇచ్చారు.  50 రూపాయల తో ప్రింటింగ్  చేసే పాస్ పుస్తకాలను,160 రూపాయలకు ఇచ్చారు. సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా పాస్ పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నారు. రైతుల పేరిట ఈ ప్రభుత్వం వందల కోట్ల అవినీతి చేస్తుంది.

loader