''అధికారంలోకి రాగానే ఆ ఎస్పీ పనిబడతాం'' (వీడియో)

First Published 5, Feb 2018, 3:57 PM IST
congress leader shabbir ali fires on nalgonda sp
Highlights
  • బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో ప్రసంగించిన షబ్బీర్ అలీ
  • కాంగ్రెస్ కార్యకర్తలు దైర్యాన్ని కోల్పోవద్దని సూచన
  • అధికారంలోకి రాగానే ఆ పోలీసులు పనిపడతామని హెచ్చరిక

కాంగ్రెస్ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని, వారు దొర మాటలకు వత్తాసు పలుకుతున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.  నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ను ఐపీఎస్ అనడానికే తనకు సిగ్గుగా ఉందని, అతడు ఖాకీ దుస్తుల ఇజ్జత్ తీసిండని మండిపడ్డారు. ఇక ఈ హత్య కేసును పరిశీలిస్తున్న డీఎస్పీ సుధాకర్ కూడా కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు వీరంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఈ పోలీసుల పనిబడతామని హెచ్చరించారు షబ్బీర్ అలీ. 

బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో పాల్గొన్న షబ్బీర్ అలీ టీఆర్ఎస్ నాయకులపై కూడా విరుచుకుపడ్డారు. అది టీఆర్ ఎస్ పార్టీ కాదు, దొంగల పార్టీ అని అన్నారు. ఇతర పార్టీల వారిని డబ్బులిచ్చి కొంటున్నారని, వినకపోతే ఇలా హత్యలు చేయిస్తున్నారని, ఈ హత్యా రాజకీయాలు ఆపాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమకు అండగా నిలిచి కొండంతా బలాన్నిస్తున్నారని, వారికి కూడా తాము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు షబ్బీర్ అలీ. 

 

వీడియో
 

loader