దుష్టుడు, దుర్మార్గుడు .. ఆయన డీఎన్ఏలో ఏదో లోపం : మంత్రి పువ్వాడ అజయ్‌పై రేణుకా చౌదరి వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేశారు. పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడని ఆరోపించారు. ఆయన డీఎన్ఏలోనే ఏదో లోపం వుందని రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

congress leader renuka chowdary sensational comments on minister puvvada ajay kumar during election campaign ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రత్యర్ధుల విమర్శలకు నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను టార్గెట్ చేశారు. కురవి మండలం బలపాల గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడని ఆరోపించారు. 

ఆయన డీఎన్ఏలోనే ఏదో లోపం వుందని రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరూ నిస్సహాయంగా వుండొద్దని.. ఓటు అనే ఆయుధంతో పువ్వాడను తరిమికొట్టాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. భవిష్యత్తు బాగుండాలంటే తుమ్మలను గెలిపించాలని , ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా వుందన్నారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలు మిగిలిపోతాయని నాగేశ్వరరావు చెప్పారు. 

Also Read: Telangana Elections 2023: ఖమ్మంలో బీఆర్ఎస్ అరాచ‌కాలు రోజురోజుకూ పెరుగుతున్న‌య్.. కేసీఆర్ పై తుమ్మ‌ల ఫైర్

తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో బలపాల గ్రామస్తులు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని అన్నారు. వామపక్ష యోధులు ఉన్న జిల్లాలో తాను గౌరవప్రదమైన రాజకీయాలు చేశానని చెప్పిన తుమ్మ‌ల.. ప్రస్తుత ఖ‌మ్మం రాజ‌కీయాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తీరుపై మండిప‌డ్డారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాను 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని స్ప‌ష్టం చేశారు.

ఖమ్మంలో బీఆర్‌ఎస్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనీ, ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) తీరునుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అరాచకాలను అడ్డుకోవ‌డానికి ఓటర్లు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. రానున్న ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న ఐదేండ్ల‌లో ఖమ్మం పునర్ నిర్మాణంతో జిల్లా ప్ర‌గ‌తికి కృషి చేస్తాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్దికి కృషి చేస్తాన‌ని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios