ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. తమ పార్టీ పోరాటంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కదిలిక  వచ్చిందని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. తమ పార్టీ పోరాటంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కదిలిక వచ్చిందని చెప్పారు. ఈరోజు పవన్ ఖేరా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ ఒత్తిడి వల్లే సీబీఐ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇంటికి వచ్చి విచారించిందని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారే క్రమంలో కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. సామాన్య ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టి బీఆర్ఎస్ పార్టీ కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబానికి వీఆర్ఎస్ ప్రకటించాలని అన్నారు. 

మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడంపై కూడా పవన్ ఖేరా స్పందించారు. కవిత పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడారని ప్రశ్నించారు. 

Also Read: ఢిల్లీలో బీఆర్ఎస్ నిరసన.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం..

Also Read: కవిత ఈడీ విచారణ: పరిస్థితిపై కేసీఆర్ ఆరా.. అరెస్ట్ చేస్తే భారీ ప్లాన్.. ఆప్ నేతలతో మంతనాలు..!!

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతుంది. మహిళా అధికారి సమక్షంలోనే కవిత విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ స్కామ్ కేసులో ఇదివరకే కస్టడీలోకి తీసుకున్న అరుణ్ రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాను కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక, ఈడీ విచారణకు వెళ్తున్న సమయంలో కవిత.. బీఆర్ఎస్ శ్రేణులకు పిడికిలి బిగించి అభివాదం చేశారు.