ఫుల్లుగా మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తూ ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి కొడుకు అడ్డంగా బుక్కయ్యాడు. జూబ్లీహిల్స్ లో ట్రాపిక్ పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఇతడు పట్టుబడ్డాడు. 

ట్రాఫిక్ పోలీసులు రోజూ మాదిరిగానే రాత్రి సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొడుకు మల్లు రవి తనయుడు సిద్దార్థ్ పట్టుబడ్డాడు. ఫుల్లుగా మద్యం సేవించి కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన సిద్దార్థ్ ను పోలీసులు బ్రీత్ అనలైజర్ తో పరీక్షించారు. దీంతో అతడు పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది. బ్రీత్ అనలైజర్ లో రీడింగ్ 76 శాతం నమోదయింది.

దీంతో పోలీసులు సిద్దార్థ్ వివరాలను నమోదు చేసుకుని కారుని స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో సిద్దార్థ ఓ ప్రైవేట్ వాహనంలో ఇంటికి వెళ్లిపోయాడు.