తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ వర్కిగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మంత్రి హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు.
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ వర్కిగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మంత్రి హరీష్ రావు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ పార్టీ ఖతం అయిపోయిందని కనుకే.. బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారనే పేరు మార్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ పేరు లేకుండా పార్టీ పేరు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే మీ పరిస్థితేమిటని ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే, ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఖమ్మం.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించనుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని విమర్శించారు. బీజేపీలో చేరేవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్టేనని అన్నారు. మతతత్వ పార్టీలకు ఖమ్మంలో ఓట్లు పడవని అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానమే లేదన్నారు.
