శాసనసభలో విపక్ష నేత విసుర్లు

తెలంగాణ శాసన సభలో పెద్దనోట్ల రద్దుపై సీరియస్ గా చర్చ జరుగుతుండగా సీఎం కేసీఆర్‌, విపక్ష నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర డిబేట్‌ జరిగింది.

కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల రాష్టానికి ఆదాయం తగ్గలేదని సీఎం చెబుతున్నారని జానారెడ్డి పేర్కొన్నారు.

దీనికపై జోక్యం చేసుకున్న కేసీఆర్‌ తానేప్పుడు అలా అనలేదని, సభ్యులికిచ్చిన పత్రాల్లోనూ అలా ఆదాయం తగ్గినట్లు పేర్కొనలేదని స్పష్టం చేశారు.

దీనిపై జానారెడ్డి అడ్డుతగులుతూ... సీఎం అలా అనకపోయినా ఆయన మాటల సారాంశం తనకు అలాగే అనిపిస్తోందని ఛలోక్తి విసిరారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తాను బహిరంగా బాధపడుతుంటే.. సీఎం తనలోతాను బాధపడుతున్నారని అన్నారు.