హైద్రాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆందోళనకు దిగారు. పోలీసులు ఆయనను అక్కడి నుండి పంపారు. అయితే ఈ విగ్రహనికి ఎదురుగానే వి.హనుమంతరావు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని Tank Bund వద్ద ఉన్న Ambedkar విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు గురువారం నాడు మౌన దీక్షకు దిగారు.అయితే అంబేద్కర్ జయంతి నిర్వాహకులు V.Hanumantha Raoతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. దీంతో police రంగ ప్రవేశం చేసి హనుమంతరావును అంబేద్కర్ విగ్రహం నుండి పక్కకు తీసుకెళ్లారు. అయితే అంబేద్కర్ విగ్రహనికి ఎదురుగా కూర్చొని హనుమంతరావు తన నిరసనను కొనసాగించారు.
Hyderabad పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. Panjaguttaలో తొలగించిన చోటునే అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయాలని వి. హనుమంతరావు హైద్రాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా దీక్షకు దిగారు. పంజాగుట్టలోనే తొలగించిన స్థానంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు హనుమంతరావు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
హనుమంతరావుపై పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. ఇవాళ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వి. హనుమంతరావు మౌన దీక్షకు దిగారు. అయితే అంబేద్కర్ జయంతి నిర్వాహకులు వి. హనుమంతరావుతో వాగ్వావాదానికి దిగారు. అయితే తాను మౌన దీక్ష చేస్తున్నానని హనుమంతరావు వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఆయన సైగలు చేశారు. అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం వద్ద దీక్ష చేయడాన్ని అంబేద్కర్ జయంతి నిర్వాహకులు అడ్డుకున్నారు.దీంతో వారితో వి. హనుమంతరావు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. అక్కడే ఉన్న పోలీసులు హనుమంతరావుని అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లారు. అయితే అంబేద్కర్ విగ్రహనికి ఎదురుగా హనుమంతరావు నిరసనకు దిగారు.
