Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll:కేసీఆర్ సై అంటే రేవంత్ కూడా సై...: అయోధ్య రెడ్డి సవాల్

హుజురాబాద్ ఉపఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీచేస్తే తప్పకుండా రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు.

congress leader ayodhya reddy counter to trs mla jeevan reddy
Author
Hyderabad, First Published Sep 10, 2021, 12:31 PM IST

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి హెచ్చరించారు. వారిని విమర్శించే స్థాయి జీవన్ రెడ్డిది కాదని... ఈ దుబాయ్ పాండు పార్క్ హయత్ హోటల్లో ఏం చేస్తుంటారో అందరికీ తెలుసని అన్నారు. నువ్వు దుబాయ్ పాస్ పోర్టుల బ్రోకర్ వి అన్న విషయాన్ని మరిచావా అంటూ జీవన్ రెడ్డిని ఎద్దేవా చేశారు.  

హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని అయోధ్య రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వున్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారపార్టీ బిజెపి కుమ్మకయ్యాయని... ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ భేటీ తర్వాతే హుజురాబాద్ ఉపఎన్నిక వాయితా పడిందని... కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నియామకాన్ని కూడా గవర్నర్ వాయిదా వేశారని అన్నారు. 

బిజెపికి టీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం లేకపోతే... నిజంగానే కేసీఆర్ అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ది రాష్ట్ర బిజెపి నాయకులకు వుంటే ప్రధాని మోదీని కలిసి విచారణకు పట్టుబట్టాలని సూచించారు. ఇప్పటికే టిపిసిసి చీఫ్ రేవంత్ సీఎం కేసీఆర్ అక్రమాలపై ఆధారాలతో సహా సిబిఐకి పిర్యాదు చేశారని... దీనిపై విచారణ జరిగేలా బిజెపి నాయకులు కేంద్రాన్ని ఒప్పించాలని అయోధ్య రెడ్డి సూచించారు.

read more  కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు... కేసీఆర్ పై సిబిఐ విచారణకు సహకరించండి: రేవంత్ రెడ్డి (వీడియో)

గురువారం జీవన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు పెంచిన లిల్లీ ఫుట్ ఈ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్ కు రేబిస్ వ్యాధి సోకిందని... అందువల్లే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కలవడంపై రేవంత్ రాజకీయం చేస్తున్నారని.... ఫెడరల్ స్ఫూర్తి గురించి రాజ్యాంగంలో 263 ఆర్టికల్ స్పష్టంగా చెబుతోందని గుర్తుచేశారు. కానీ రాజకీయ పరిపక్వత లేని రేవంత్ కు రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం ప్రధానిని కలవడం తప్పుగా కనిపిస్తుందా? తెలంగాణకు సంబంధించిన పన్నెండు అంశాలపై పీఎకు సీఎం కెసిఆర్ వినతిపత్రాలు ఇచ్చారు. అంతేతప్ప రేవంత్ ఆరోపించినట్లు రాజకీయాలు మాట్లాడలేదని జీవన్ రెడ్డి వివరించారు. 

''ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం సీట్ల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నారా? అయితే పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ ఈ నెల పదకొండునే పీఎం మోడీని కలిశారు. మరి ఆయన కూడా కాంగ్రెస్ టిక్కెట్ల గురించి మోడీతో చర్చించారా? చైనా రాయబారిని కూడా మీ నాయకుడు రాహుల్ గాంధీ చాలా సార్లు కలిశారు... అయితే ఆయన దేశ ద్రోహానికి పాల్పడినట్లేనా? ఎమ్మెల్యే సీతక్కను నువ్వే చంద్రబాబు దగ్గరకు పంపావు కదా... కాంగ్రెస్ టిక్కెట్లు నిర్ణయించడానికే పంపావా?'' అంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ జీవన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు అయోధ్య రెడ్డి. 


 

 
 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios