Asianet News TeluguAsianet News Telugu

కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు... కేసీఆర్ పై సిబిఐ విచారణకు సహకరించండి: రేవంత్ రెడ్డి (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందని.., దీనిపై సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సహకరించాలని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. 

TPCC Chief Revanth Reddy Complaint CBI On CM KCR and His Family Corruption
Author
New Delhi, First Published Sep 9, 2021, 4:13 PM IST

న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ అవినీతిపై విచారణ జరపాలంటూ సిబిఐకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం డిల్లీలోనే వున్న రేవంత్ ఇవాళ సిబిఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సీబీఐ డైరెక్టర్ ను కలిసి కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదుచేశారు.  ముఖ్యంగా హైదరాబాద్ లోని కోకాపేట్, ఖానామెట్ లోని ప్రభుత్వ భూముల వేలంపాట విషయంలో భారీ అవినీతి జరిగిందని... దీనిపై విచారణ జరపాల్సిందిగా సిబిఐని కోరినట్లు రేవంత్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీతో సమావేశంలో కేసీఆర్ అవినీతిపై సిబిఐకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపామని... అందుకు ఆయన అంగీకారం తెలపడంతో ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు రేవంత్. కరోనా నిబంధనల కారణంగా ఒక్కరిద్దరే రావాలని సిబిఐ డైరెక్టర్ సూచించారని... అందువల్లే ఒంటరిగానే సిబిఐ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై అన్ని ఆధారలను సిబిఐ అధికారులకు అందించినట్లు రేవంత్ వెల్లడించాడు. 

వీడియో

కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై టెండర్ల గోల్ మాల్ కు కేసీఆర్ సహకరించిన ప్రస్తుత తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఐఎఎస్ అధికారులు జయేష్ రంజన్, అర్వింద్ కుమార్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీరిపై ఎవ్వరి అనుమతి లేకుండా విచారించవచ్చు... కాబట్టి వెంటనే విచారణ ప్రారంభించాలని సిబిఐ డైరెక్టర్ ను కోరినట్లు రేవంత్ వెల్లడించారు. 

READ MORE  కోకాపేట భూముల విక్రయం: సీబీఐకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపద దోపిడి చేసిందని... తొందర్లొనే జైలుకు పంపుతామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ చెబుతుంటారు. కానీ ఆ అవినీతిపై ఎక్కడా ఫిర్యాదుచేయడం గానీ... విచారణకు ఆదేశించాలని కేంద్రాన్ని కోరడం గానీ చేయడం లేదన్నారు. తమ పార్టీకే చెందిన ప్రధానికి గానీ,హోంమంత్రికి గానీ ధర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ కి గానీ పిర్యాదు చేయడం లేదన్నారు. 

తెలంగాణ బిజెపి నాయకుల తీరు చూస్తుంటే కేసీఆర్ తో కుమ్మయినట్లు కనిపిస్తోందన్నారు. అలా అనుకోకుండా వుండాలని సంజయ్, కిషన్ రెడ్డి తాము సిబిఐకి చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపించేలా కేంద్రంపై ఒత్తిడితెచ్చి ఒప్పించాలని సవాల్ విసిరారు. బిజెపికి చిత్తశుద్ది వుంటే...మోదీ, అమిత్ షాకు నీతి నిజాయితితో కూడిన పరిపాలన అందించాలనుకుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించాలన్నారు. లేదంటే సంజయ్, పాదయాత్ర, కిషన్ ఆశీర్వాద యాత్రలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మరని రేవంత్ అన్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios