ఖమ్మం సభను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ సభపై ప్రసంగించే అవకాశం కొందరికే ఇవ్వనుంది. రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురు మాత్రమే ఈ సభపై మాట్లాడనున్నట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నలుగు, పార్టీలో చేరనున్న పొంగులేటి మాట్లాడుతారని సమాచారం. 

హైదరాబాద్: ఖమ్మం సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచి శంఖారావం పూరించనుంది. రాహుల్ గాంధీ హాజరై మాట్లాడటంతో ఈ సభకు ప్రాధాన్యత పెరిగింది. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ, అదే విధంగా సీనియర్ లీడర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఇదే సభపై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

ఈ సభను కాంగ్రెస్ వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నది. అసంతృప్తి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా కట్టడి చేస్తున్నది. కాంగ్రెస్ నేతలకూ అధిష్టానం అదే స్పష్టంగా, కఠినంగా చెప్పింది. ఈ తరుణంలో ఖమ్మం సభలో కొందరికే మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిసింది. 

ముందు రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐదుగురు మాట్లాడతారని సమాచారం. రాహుల్ గాంధీ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ లీడర్ల భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరిలు మాట్లాడతారని తెలిసింది. అలాగే.. ఖమ్మం జిల్లాకే చెందిన సీనియర్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రావు ఈ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత మాట్లాడనున్నారు.

Also Read: ప్లాన్ మార్చిన ఎంఐఎం.. బీఆర్ఎస్‌తో తెగదెంపులు? కాంగ్రెస్‌తో దోస్తీ!

అంతేకాదు, ఈ సభలో రాహుల్ గాంధీ ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రవేశపెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని హామీలను కాంగ్రెస్ ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఖమ్మం సభ ప్రారంభం కానుంది.